Andhra PradeshHome Page Slider

‘అవయవదానానికి మతాచారాలు అడ్డురాకూడదు’..ఏపీ మంత్రి

అవయవదానం అన్ని దానాల కంటే గొప్పదని ఏపీ మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. దీనికి మతాచారాలు అడ్డురాకూడదని, ఏ దేవుడూ సాటి మనిషి ప్రాణం కాపాడొద్దని చెప్పరని మంత్రి అన్నారు. విజయవాడలో జీవన్‌దాన్‌పై అవగాహనా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన అవయవదానానికి అంగీకరిస్తూ సంతకాలు చేశారు. ఇకపై అవయవదానం చేసిన వ్యక్తి అంత్యక్రియలలో కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొని వీర వందనం చేసేలా చట్టంలో మార్పులు తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న వేల మంది వ్యక్తులు అవయవదానంతో జీవించే అవకాశాలున్నాయని, అందరూ దీనికి సహకరించాలని కోరారు. చనిపోయాక నిరుపయోగంగా మట్టిలో కలిసిపోయే దేహంలో పరులకు పనికి వచ్చే అవయవాన్ని దానం చేస్తే, వారికి పునర్జన్మ అందించినవాళ్లమవుతామని పేర్కొన్నారు.