NationalNews

కాంగ్రెస్‌కు ఊరట… కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు

భారత్‌ జోడో యాత్రలో కేజీఎఫ్‌-2 సినిమాలోని పాటలను అక్రమంగా ఉపయోగించారన్న వివాదంలో కాంగ్రెస్‌కు ఊరట లభించింది. ఈ వివాదంపై మంగళవారం కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఈ వివాదంపై బెంగుళూరు పోలీసులు కేసు నమోదు చేయగా.. కాంగ్రెస్‌ ట్వీట్టర్‌ అకౌంట్‌ తాత్కాలికంగా బ్లాక్‌ చేయాలని బెంగళూరు కోర్టు ఆదేశించింది.  బెంగళూరు కోర్టు ఆదేశాలను కాంగ్రెస్‌ పార్టీ సవాల్‌ చేయగా.. కింది కోర్టు ఆదేశాలను హైకోర్టు నిలుపుదల చేసింది.

తాజాగా బెంగళూరు కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని హైకోర్టును కాంగ్రెస్‌ పార్టీ కోరింది. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు… కాంగ్రెస్‌ పార్టీ వాదనతో ఏకీభవించింది. కాంగ్రెస్‌ పార్టీ, భారత్‌ జోడో యాత్రల ట్విట్టర్‌ అకౌంట్లను రద్దు చేయాలన్న బెంగళూరు కోర్టు ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్‌ పార్టీ హర్షం వ్యక్తం చేసింది.