మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో రిలీఫ్
ప్రముఖ సినీనటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో రిలీఫ్ లభించింది. గతంలో జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. దీనితో ఆయన సుప్రీంకోర్టులో ఆప్పీలు చేసుకోగా, ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. డిసెంబర్ 10, 2024నాడు జల్‌పల్లిలోని తన ఇంటి ప్రాంగణంలో మంచు మనోజ్, విష్ణు గొడవల సందర్భంగా తనను ప్రశ్నించిన జర్నలిస్టు చేతిలో మైక్ లాక్కొన్ని అతని ముఖంపై కొట్టారన్న అభియోగంతో ఆయనపై కేసు నమోదయ్యింది.

