Home Page SliderNational

జార్ఖండ్ సీఎంకు సుప్రీంకోర్టులో ఊరట

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు మంజూరైన బెయిల్‌ను సవాలు చేస్తూ ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోమని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు తీర్పు సరైనదేనని పేర్కొంది. జూన్ 28న హైకోర్టులో భూకుంభకోణం కేసులో అరెస్టయిన హేమంత్‌కు బెయిల్ మంజూరు చేసింది జార్ఖండ్ హైకోర్టు. ఈ కుంభకోణంలో హేమంత్ ప్రమేయం ఉన్నట్లు రికార్టులు నిరూపించలేదని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు తీర్పు చట్టవిరుద్ధమంటూ ఈడీ ఈ బెయిల్‌ను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.