Andhra PradeshHome Page Slider

విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులకు ఊరట

విశాఖ స్టీల్‌ప్లాంట్ బాధితులకు ఊరట కలిగే నిర్ణయం కేంద్రప్రభుత్వం తీసుకోబోతోందని సమాచారం. స్టీల్‌ప్లాంటును మరో ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో విలీనం చేసే అంశాన్ని కేంద్రప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ఆర్థిక పరమైన, నిర్వహణ పరమైన సమస్యలను ఎదుర్కొంటోంది. దీనితో దానిని అధిగమించేందుకు సెయిల్ విలీనం అంశాన్ని ఒక ప్రత్యామ్నాయంగా కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, సెయిల్‌ను విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్లాంటుకు రుణాలు అందించడం, పెల్లెట్ ప్లాంట్ కోసం ఎఎమ్‌డీసీకి 2వేల ఎకరాల భూమిని విక్రయించే ఉద్దేశం ఉందని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంటుకు సంబంధించిన భూములు, బ్యాంకు రుణాలు వంటి అంశాలను కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల ఆందోళనలు చేస్తున్నారు. స్టీల్ ప్లాంటుకు సొంత గనులు లేకపోవడం వల్ల సెయిల్‌లో విలీనం చేయాలని కూడా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. దీనితో కేంద్రం ఈ అంశాన్ని పరిశీలిస్తోంది.