పాక్ కుటుంబానికి సుప్రీం కోర్టులో ఊరట..!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం కారణంగా పాక్ జాతీయుల వీసాలు రద్దయ్యాయి. దీంతో కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన ఆరుగురు సభ్యులున్న అహ్మద్ తారిక్ భట్ కుటుంబం కూడా తిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. వీసా గడువు ముగిసినా వీరు ఇంకా భారత్‌లోనే ఉన్నట్లు తేలింది. ఆ కుటుంబం కశ్మీర్‌లో ఉండగా.. కుమారుడు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు.ఈ నేపథ్యంలో ఆ కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై వాదనలను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్‌కే సింగ్ ధర్మాసనం విన్నది. తమవద్ద ప్రభుత్వ గుర్తింపు కార్డులు, ఆధార్, పాన్, ఓటర్ ఐడీ అన్నీ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కుటుంబంలో ఒకరు పాకిస్థాన్‌లో జన్మించినా.. ఆ తర్వాత భారత్‌కు వలసవచ్చి ఆ దేశ పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేశారని పిటిషనర్ న్యాయవాది నంద కిషోర్ కోర్టుకు వెల్లడించారు.

