ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంలో రిలీఫ్..
వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో సీఐడీ కేసు విషయంలో రిలీఫ్ లభించింది. ఆయన ఏపీ మద్యం కొనుగోలు వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. గత నెలలో ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, ఏపీ సీఐడీ దర్యాప్తులో మిథున్ రెడ్డిని నిందితునిగా పేర్కొనలేదని వెల్లడించింది. దీనితో ఈ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. అయితే ఢిల్లీకి సీఐడీ వర్గాలు వెళ్లడంతో మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో తన పిటిషన్ దాఖలు చేశారు. దీనితో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఎంపీపై చర్యలు తీసుకోవద్దని, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

