Home Page SliderPoliticsTelangana

హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట

బి.ఆర్.ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఉట్నూరు పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.మూసీ ప్రాజెక్టు పేరుతో రూ.25 వేల కోట్ల నిధులను కాంగ్రెస్‌ పార్టీ తరలించిందంటూ కేటీఆర్‌ చేసిన ఆరోపణలు తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు. దీంతో ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు పోలీసుస్టేషన్‌లో గత ఏడాది సెప్టెంబరు 30న కేసు నమోదైంది. ఈక్రమంలో కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. తాజాగా ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది.