National

ఫోన్ ధరకే జియో ల్యాపీ- అదిరిపోయే ఫీచర్స్

మనసర్కార్ :

 ల్యాప్ టాప్ తక్కువ ధరలో కొనాలని ఎదురుచూస్తున్నారా.. ల్యాప్ టాప్ కొనాలంటే 25 వేల పైమాటే. కానీ ఇప్పుడు కేవలం 15,799 రూపాయలకే రిలయన్స్ జియో నుండి జియోబుక్ వచ్చేసింది. కేవలం ఒక స్మార్ట్ ఫోన్ ధరకే ల్యాప్ టాప్‌ను సొంతం చేసుకోవచ్చు. దీనిని రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ అండ్ వెబ్ సైట్‌లలో కొనుగోలు చేయవచ్చు. దీనికి పలు బ్యాంక్ కార్టులపై కూడా ఆఫర్లు ఉన్నాయి. స్టేట్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ బ్యాంక్ మొదలైన బ్యాంకులు డెబిట్, క్రెడిట్ కార్డులపై కొంటే 10 శాతం తగ్గింపు కూడా లభిస్తోంది.

తక్కువ ధరకు వస్తోందని ఫీచర్స్ ఏమీ లేవనుకోవద్దు. దీనికి 11.6 అంగుళాలు HD డిస్ ప్లే ఉంది. 2 జీబీ RAM, 2 మెగా ఫిక్సల్ కెమెరా, 32 జీబీ స్టోరేజ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. జియో ఓఎస్‌తో పని చేస్తుంది. జియోస్టోర్ ద్వారా థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీనికి 8 గంటలపాటు బ్యాటరీ బ్యాకప్ ఉంది. దీని బరువు 1.5 కిలోలు. ఒక సంవత్సరం వారంటీ లభిస్తోంది. విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆన్ లైన్ క్లాసులు వినడానికీ, వీడియో లెసెన్స్ వినడానికీ, చాలా ఉపయోగపడుతుంది. బేసిక్ మోడల్ ల్యాప్ టాప్ కోసం చూసే వారికి ఇది చాలా మంచి ఎంపిక అని చెప్పవచ్చు.