ఏపీలో వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్ విడుదల
కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన బడ్జెట్‌లో ఏపీకి భారీగా నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ విడుదల చేసింది. కాగా జిల్లాకు రూ.300కోట్ల చొప్పున 7 జిల్లాలకు కేంద్రం నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. అయితే మొత్తం 7 జిల్లాలకు రూ.1750కోట్ల నిధులు విడుదల చేసినట్లు కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు.

