మూడు స్టెప్పుల్లో సులభంగా ఆయుష్మాన్ భారత్‌కు నమోదు చేసుకోండి
ఇటీవల 70 సంవత్సరాలు పైబడిన వృద్ధులందరికీ ఆదాయంతో సంబంధం లేకుండా రూ.5 లక్షల ఆరోగ్య భీమా సౌకర్యాన్ని కలిపించింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకాన్ని నేడు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ధన్వంతరి జయంతి, ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. నేటి నుండి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకానికి నమోదు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నారు.
దీనిని చాలా సులభంగా మూడు స్టెప్పుల్లో నమోదు చేసుకోవచ్చు. పీఎంజేఏవై పోర్టల్‌లో యామ్ ఐ ఎలిజిబుల్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. దీంతో beneficiary.nha.gov.in అనే వెబ్‌సైట్‌కి చేరుతారు. క్యాప్చా, మొబైల్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేసి, కేవైసీ వివరాలు నమోదు చేయాలి. అధికారిక ఆమోదం లభించాక బీమా కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

