కొత్త ఓటు ఇలా నమోదు చేసుకోండి
కొత్తగా 18 ఏళ్లు నిండిన వారికి ఓటు నమోదు చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెల 28 లోపు దరఖాస్తులు చేసుకోవలసి ఉంది. ఓటరు నమోదుకు ఫాం-6, అభ్యంతరాలకు ఫాం -7, సవరణలకు ఫాం-8 నింపాలి. దీనికోసం voters.eci.gov.in లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం 1950 టోల్ ఫ్రీ నెంబరుకు కూడా కాల్ చేసి సమాచారాన్ని పొందవచ్చు.

