మూడేళ్లలో రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేస్తాం: మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణలో 2018 నుండి రీజనల్ రింగ్ రోడ్డుపై చర్చ జరుగుతోంది కానీ ముందుకు కదలడం లేదని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక రీజనల్ రింగ్ రోడ్డు ఎన్నికల కోడ్ వల్ల ఆలస్యం అయ్యిందని తెలిపారు. హైదరాబాద్, విజయవాడ రహదారిని 6 లైన్ల రహదారిగా మార్చాలని రోజుకి 60 వేల వాహనాలు తిరుగుతాయని చెప్పారు. వచ్చేమూడేళ్లలో రీజనల్ రింగ్ రోడ్డు, విజయవాడ- హైదరాబాద్ 6 లైన్ల రహదారిని పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు.