2024లో ప్రాంతీయ పార్టీలే కీలకం, ప్రధాని రేసులో మమత
లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయపార్టీల హవా
వచ్చే ఎన్నికల్లో రీజనల్ పార్టీలది కీలక పాత్ర
ప్రధాని రేసులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
బీజేపీకి వ్యతిరేకంగా జనాన్ని మొబిలైజ్ చేయడం ముఖ్యం
ప్రజల్లో మమత బెనర్జీకి గుర్తింపును బట్టే కీలక పదవి
దేశ రాజకీయాలపై అమర్త్యసేన్ సంచలన వ్యాఖ్యలు
2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి అనుకూలంగా జరుగుతాయనుకోవడం “పొరపాటు” అవుతుందన్నారు నోబెల్ గ్రహీత అమర్త్యసేన్. అనేక ప్రాంతీయ పార్టీల పాత్ర “స్పష్టంగా ముఖ్యమైనది” అని భావిస్తున్నానన్నారు. “రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి భారతదేశ తదుపరి ప్రధానమంత్రి అయ్యే సత్తా ఉన్నప్పటికీ అందుకు ఎన్నో సవాళ్లు ఉన్నాయన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి… ప్రజలను ఏవిధంగా, బీజేపీకి వ్యతిరేకంగా చైతన్యవంతుల్ని చేయగలరన్నదానిపై ఆమె.. ప్రధాని పీఠానికి అర్హత పొందగలరన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు ఈసారి కీలక పాత్ర పోషించడం ఖాయమన్నారు అమర్త్యసేన్. దక్షిణాదికి చెందిన డీఎంకే ముఖ్యమైన పార్టీ అని తాను అంచనా వేస్తున్నట్టు చెప్పారు అమర్త్యసేన్.

తృణమూల్ కచ్చితంగా ముఖ్యమైనదని, సమాజ్‌వాదీ పార్టీకి కొంత ప్రభావం చూపించినా ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పలేమన్నారు అమర్త్యసేన్. మిగిలిన పార్టీల కంటే హిందువుల వైపు మొగ్గు చూపే దృక్పథం ఉన్న పార్టీగా బీజేపీ అగ్రస్థానంలో ఉందన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి), జనతాదళ్ (యునైటెడ్)తో సహా పలు పార్టీల నాయకులు 2024 లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌తో సహా కొత్త కూటమికి పిలుపునిచ్చారని… ఐతే… వచ్చే ఎన్నికల్లో ద్విముఖపోటీ ఉంటేనే బీజేపీ ఓటమిని సంభవమన్నారు అమర్త్యసేన్. భారతదేశం దృష్టిని బీజేపీ గణనీయంగా తగ్గించిందని… ఇది భారతదేశాన్ని కేవలం హిందూ భారతదేశంగా, హిందీ మాట్లాడే భారతదేశంగా పరిధిని కుదించేసిందన్నారు. ఈ రోజు భారతదేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేకపోవడం విచారకరమన్నారు. ఐతే అందరూ ఒక విషయాన్ని గ్రహించాలన్నారు. బీజేపీ బలంగా, శక్తివంతంగా కనిపిస్తున్నట్టుగానే… బలహీనతలు కూడా ఉన్నాయన్నారు. బీజేపీని ఓడించే విషయంలో సత్తా ఉంటే… ఇతర రాజకీయ పార్టీలు నిజంగా ప్రయత్నించి సఫలం కాగలవన్నారు. ఐతే, బీజేపీయేతర పార్టీలు… కలిసికట్టుగా ఉంటాయన్న నమ్మకం లేదన్నారు.

మమత బెనర్జీ దేశానికి తదుపరి ప్రధానమంత్రి కాగలరా లేదా అనే దానిపై అడిగిన ప్రశ్నకు అమర్త్యేసేన్ సూటిగా బదులిచ్చారు. మమతకు ప్రధాని కాగల సత్తా ఉందన్నారు. మమత బెనర్జీ ప్రధాని పదవికి సామర్థ్యం లేదని తాను అనడం లేదన్నారు. ఆమెకు స్పష్టమైన సామర్థ్యం ఉందన్నారు. మరోవైపు, మమత బీజేపీకి వ్యతిరేకంగా ప్రజల్లో ఆలోచన తేగలరన్న, విశ్వాసం నమ్మకం కలిగించాల్సి ఉందన్నారు. భారతదేశంలో విభజన రాజకీయాలను అంతం చేయడానికి ఆమె నాయకత్వం వహించాల్సి ఉందన్నారు అమర్త్యసేన్. కాంగ్రెస్ బలహీనంగా ఉన్నప్పటికీ దేశాన్ని ఏకం చేయగల సత్తా ఆ పార్టీకే ఉందన్నారు. కాంగ్రెస్ కచ్చితంగా అఖిల భారత విజన్‌ను అందిస్తోందని… ఇది మరే ఇతర పార్టీలకు ఆ లక్షణాలు లేవన్నారు. కాంగ్రెస్ చాలా బలహీనపడినట్లు కనిపిస్తోందని… ఎవరైనా కాంగ్రెస్‌పై ఎంతవరకు ఆధారపడగలరో చెప్పలేమన్నారు.

2019 లోక్ సభ ఎన్నికలకు ముందు మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్, టీఆర్ఎస్ నేతృత్వంలో కేసీఆర్, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పాటుగా మరికొన్ని ప్రాంతీయ పార్టీలు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నించాయన్నారు. ఆ ఏడాది జనవరిలో కోల్‌కతాలో తృణమూల్ అధినేత ఏర్పాటు చేసిన భారీ సమావేశంలో నేతల మధ్య ఇందుకు సంబంధించి చర్చలు జరిగాయన్నారు. నాటి కర్నాటక సీఎం కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, అరవింద్ కేజ్రీవాల్, ఎంకె స్టాలిన్, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, జమ్మూ, కాశ్మీర్‌కు చెందిన ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన గెగాంగ్ అపాంగ్ చర్చల్లో పాల్గొన్నారన్నారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగలదన్న నమ్మకం తనకు లేదన్నారు సేన్.

