Home Page SliderNational

రీల్స్ పిచ్చి.. నదిలో కొట్టుకుపోయిన యువతి..

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ యువతి గంగా నదిలో రీల్ చేసేందుకు యత్నించి ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీలో మణికర్ణిక ఘాట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. యువతి నీటి ప్రవాహాన్ని అంచనా వేయకపోవడంతో పాటు ఆమెకు ఈత రాకపోవడంతో గంగా నదిలో మునిగి కొట్టుకుపోయింది. రీల్స్ కంటే ప్రాణాలు ముఖ్యమని, ఇలాంటి వెర్రివేషాలు వేయొద్దని నెటిజన్లు ఫైరవుతున్నారు. వెంటనే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం అక్కడికి చేరుకుని గల్లంతైన యువతి కోసం గాలిస్తున్నారు.