దేశంలో తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర
గతంలో కేంద్రం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్,వాణిజ్య సిలిండర్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం వీటిలో వాణిజ్య సిలిండర్ ధరను తగ్గించాలని కేంద్ర చమురు సంస్థలు నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో 19 కేజీల ఎల్పీజీ సిలిండర ధరను రూ.91.50/- మేర తగ్గించనున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,028/-కు తగ్గింది. కాగా తగ్గిన ధరలు నేటి నుంచే అమలు లోనికి రానున్నట్లు కేంద్ర చమురు సంస్థలు తెలిపాయి. అయితే 14.2 కేజీల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదని కేంద్ర చమురు సంస్థలు వెల్లడించాయి.

