Home Page SliderTelangana

తెలంగాణాకు మరోసారి రెడ్ అలర్ట్

తెలంగాణాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణశాఖ ఇవాళ కూడా తెలంగాణా రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాగా ఈరోజు తెలంగాణాలోని ఉమ్మడి నల్గొండ,ఉమ్మడి వరంగల్,ఉమ్మడి ఖమ్మమ్ జిల్లాల్లో చాలాచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD పేర్కొంది. అయితే కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు పడతాయని తాజాగా నివేదికలో వెల్లడించింది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్,ఉమ్మడి నిజామాబాద్,ఉమ్మడి మెదక్,ఉమ్మడి హైదరాబాద్ పరిధిలో భారీ నుంచి అతి భారీ వానలు కురుస్తాయని IMD వెల్లడించింది. కాగా రాష్ట్రంలోని మిగతా చోట్ల కూడా విస్తారంగా వర్షాలు పడతాయని IMD తెలిపింది. ఈ మేరకు తెలంగాణా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే తప్ప బయటికి రావొద్దని  వాతావరణశాఖ సూచించింది.