Home Page SliderTelangana

తెలంగాణకు రెడ్ అలెర్ట్ –బయటకు రావొద్దు

తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. పని లేకపోతే బయటకు రావొద్దని, భారీ, అతిభారీ వర్షాలు పడవచ్చని హెచ్చరించింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ వర్ష సూచన ఉంది. హైదరాబాద్, కొత్తగూడెం, గద్వాల్, కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, మెహబూబ్ నగర్, ములుగు, మెదక్, మల్కాజ్ గిరి, సిరిసిల్ల, పెద్దపల్లి, నాగోల్, నారాయణపేట్,నిర్మల్,రంగారెడ్డి, వనపర్తి ప్రాంతాలలో భారీ వర్షాలు పడతాయని, హన్మకొండ, భువనగిరిలో మధ్యాహ్నం లోగా ఒక మోస్తరు వర్షాలు పడొచ్చని గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.