రికార్డు స్థాయిలో జనసేన సభ్యత్వాలు నమోదు: నాగబాబు
ఇవాళ రికార్డుస్థాయిలో జనసేన సభ్యత్వాలు నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకు ఆ పార్టీలో 10 లక్షల సభ్యత్వాలు నమోదైనట్లు సమాచారం.కాగా గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువగా సభ్యత్వాలు నమోదైయ్యాయని జనసేన వర్కింగ్ ప్రెసిడెంట్ నాగబాబు పేర్కొన్నారు. అయితే ఏపీలోని ప్రతి నియోజకవర్గంలో 5వేల సభ్యత్వాలు కావాలని ఆయన తెలిపారు.జనసేన సభ్యత్వ నమోదుకు మరో వారం రోజులు గడువు ఉందని నాగబాబు వెల్లడించారు.