రికార్డ్ సృష్టించిన డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ అత్యధిక పరుగులు చేసిన రెండవ అసీస్ ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. గతంలో మాజీ కెప్టెన్ స్టీవ్ వా 18,496 పరుగుల రికార్డును అధిగమించారు డేవిడ్ వార్నర్. అన్ని ఫార్మట్స్‌లో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 18,515 పరుగులతో స్టీవ్ వా రికార్డును బద్దలు కొట్టాడు. వార్నర్ రెండో స్థానానికి ఎగబాకగా, మొదటి స్థానంలో 27,368 పరుగులతో రికీపాంటింగ్ కొనసాగుతున్నారు. వార్నర్ టెస్టుల్లో 8,689 పరుగులు, వన్డేలలో 6,932, టీ 20 మ్యాచ్‌లలో 2,894 పరుగులు సాధించాడు.