అమెరికాలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు
ఓపక్క భారత్ భారీ వర్షాలతో అల్లాడుతుంటే మరోపక్క అమెరికా దేశాలు వేసవి తాకిడికి అల్లల్లాడతున్నాయి. అమెరికాలోని 38 నగరాలలో రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణ్రోగ్రతలు నమోదవుతున్నాయి. లాస్ వెగాస్‌లో 48 డిగ్రీలు నమోదయితే,ఫీనిక్స్, అరిజోనాలలో 43 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి. ఇక కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ నిజంగా డెత్ వ్యాలీగా మారిపోతోంది. అక్కడ గరిష్టంగా ఆదివారం నాడు 53.9 డిగ్రీల ఉష్ణ్రోగ్రత నమోదు అయ్యింది. దీనితో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే అక్కడి హోటల్స్, క్యాసినోలు ఖాళీగా కనిపిస్తున్నాయి.

ఇక కెనడాలో కార్చిచ్చులకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మానవ కార్యకలాపాల వల్లే ఇలా వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రజలకు ఉపశమనం కోసంకాలిఫోర్నియా, నెవాడాలోని కొన్ని పబ్లిక్ భవనాలను శీతలీకరణ కేంద్రాలుగా మారుస్తున్నారు. బయట వేడినుండి ఉపశమనం పొందడానికి ఈ ప్రదేశాలలో సేద తీరవచ్చని అధికారులు తెలిపారు. వాతావరణంలో ఏదైనా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు బాగా పెరిగినప్పుడు వేడి కేంద్రీకృతం అవుతుంది. ఈ కారణంగా హీట్ డోమ్‌లు ఏర్పడతాయి. అలా ఈ హీట్ డోమ్ దక్షిణ అమెరికా అంతటా విస్తరిస్తునందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

