రికార్డు స్థాయిలో విరాళాలు
ఏపీ వరదల సమయంలో సీఎం సహాయనిధికి రూ.400 కోట్లు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇంత స్థాయిలో ఇన్నికోట్లు రావడం చరిత్రలో ఇదే మొదటిసారన్నారు. విజయవాడ వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంత పెద్ద విపత్తు కలిగినప్పుడు అందరూ ఒక్కటై పనిచేశారన్నారు. ప్రభుత్వంతో పాటు సామాన్యులు, అధికార యంత్రాంగం కలిసికట్టుగా పనిచేయడం వల్లే తక్కువ సమయంలో విపత్తు నుండి బయటపడ్డామని పేర్కొన్నారు. ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు బుడమేరు నీరు పోటెత్తడంతో విజయవాడ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు చంద్రబాబు.