NationalNews Alert

భారత కంపెనీలకు ఏటా లక్షల కోట్లు నష్టానికి కారణం ఇదే

ఏ సంస్థకైనా ప్రధానమైన ఆయువుపట్టు  మానవవనరులు. సిబ్బంది బాగా నైపుణ్యాలు కలిగి ఉండి, కష్టపడి పనిచేసే వారైతే ఆసంస్థ ఎంతో వృద్ధిలోకి వస్తుంది. లేకపోతే అది ఎంత పెద్ద కంపెనా అయినా, ఎంత ఆధునిక సౌకర్యాలున్నా అది వ్యర్థమే అవుతుంది. ప్రముఖ MNC కంపెనీ డెలాయిట్ ఈ మధ్య ఒక తాజా సర్వే నిర్వహించింది.

సిబ్బంది గైర్హాజరు, ఉత్పత్తి తగ్గుదల, ఉద్యోగుల వలసలు వంటి కారణాల వల్ల కంపెనీలకు ఏటా 1,400 కోట్ల డాలర్లు (దాదాపు 1.12 లక్షల కోట్ల రూపాయలు) మేరకు నష్టం వాటిల్లుతోందని ఆ రిపోర్టులో తేలింది. కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మానసిక సమస్యలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. WHO ప్రకారం ప్రపంచ మానసిక ఆరోగ్య భారంలో భారత్ వాటా దాదాపు 15 శాతంగా ఉంది. గత ఏడాది కాలంలో 80 శాతం మంది భారత ఉద్యోగులు మానసిక సమస్యలు ఎదుర్కొంటునట్లు తెలుపారు.

భారత సిబ్బంది మానసిక స్థితిని విశ్లేషించేందుకు డెలాయిట్ టచ్ థామట్సు ఇండియా ఎల్‌ఎల్‌పీ ఈ సర్వేను నిర్వహించింది. వృత్తి సంబంధమైన ఒత్తిళ్లు తమ మానసిక స్థితిని ప్రభావితం చేసే అంశాలలో మొదటిదని 47 శాతం మంది వెల్లడించారు. రెండు, మూడు స్థానాలలో ఆర్థిక పరమైన సమస్యలు, కరోనా సంబంధిత సవాళ్లు ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది. మానసిక సమస్యల వల్ల ఉద్యోగం వదిలేసినవారు 20 శాతం మంది కాగా, సమస్యలున్నప్పటికీ ఉద్యోగం కొనసాగిస్తున్నామని 33 శాతం మంది తెలిపారు.