‘నా తప్పు తెలుసుకున్నాను’.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్
తన జీవితంలో ఒక తప్పు చేశానని, దానిని తెలుసుకుని బాధపడ్డానని, సరిదిద్దుకున్నానని సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పేర్కొన్నారు. ఆస్కార్ అవార్డు పొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో నాటునాటు సాంగ్‌కు గళం కలిపిన గాయకుడు రాహుల్, పైగా ఆస్కార్ స్టేజిపై కూడా ఆయన ప్రదర్శన ఇచ్చారు. ఆయన తప్పు గురించి మాట్లాడుతూ నా తప్పు ఏమిటంటే సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తాను దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పెట్టడమే. ‘రంగమార్తాండ’ చిత్రం షూటింగులో ప్రకాశ్‌రాజ్‌తో తాను రజనీకాంత్‌కు వీరాభిమానిని అని చెప్పాను. అందుకే తనను రజనీకాంత్‌తో షూటింగుకు తీసుకువెళ్లారు. అప్పుడు రజనీకాంత్ ‘అన్నాత్తే’ చిత్రం షూటింగులో ఉన్నారు. ఆయన కాళ్లకు నమస్కరించి ఆయనతో ఫోటో దిగాను. అయితే అప్పుడు ఆయన మూవీ కాస్ట్యూమ్‌లో ఉన్నారు. ఈ చిత్రంలో తన లుక్ ఇంకా రిలీజ్ చేయలేదని, సినిమా రిలీజ్ అయ్యేంత వరకూ ఫోటోను షేర్ చెయ్యొద్దని చెప్పారు. అయితే ఒకసారి పొరపాటున సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నిర్మాణసంస్థ కంగారు పడింది. దీనితో ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకుని వెంటనే డిలీట్ చేశానని పేర్కొన్నారు.

