పందేలకు రెడీ..తగ్గేదే లే..
సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలలో భోగి మంటలు, సంక్రాంతి ముగ్గులతో పాటు గుర్తొచ్చేది పందెం కోళ్లు. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలలో ప్రతీ సంవత్సరం జోరుగా కోడి పందాలు జరుగుతుంటాయి. కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందే ఈ కోడిపుంజులు ప్రత్యేక శిక్షణతో పోటీకి రెడీ అయిపోతున్నాయి. ఏలూరు, కాకినాడ, అమలాపురం, భీమవరం వంటి పట్టణాలలో వీటికోసం ప్రత్యేక ఏర్పాట్లు మొదలయ్యాయి. బలమైన ఆహారం ఇచ్చి వాటిని పందానికి సిద్ధం చేస్తున్నారు. చట్టవిరుద్ధమైన ఈ పోటీలు నిర్వహించకూడదని పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా రహస్యంగా ఈ పందేలు జరిగిపోతుంటాయి.