ఆర్సీబీకి కొత్త కెప్టెన్.. కోహ్లి ఏమన్నారంటే..
ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఆర్సీబీ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. రజత్ పటీదార్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథ్యం అప్పగించింది. గతంలో ఈ టీమ్‌కు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కొత్త కెప్టెన్సీపై విరాట్ కోహ్లి ఇప్పటికే స్పందించారు. రజత్ కెప్టెన్‌గా మంచి పేరు తెచ్చుకోగలడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్సీబీకి గత సారథుల మాదిరిగానే జట్టును ముందుకు నడిపిస్తారని ఆశించారు. జట్టులో అతడు ఎదిగిన తీరు అద్భుతమని, అతనికి ప్రతీ ఒక్కరూ మద్దతుగా నిలుస్తారని హామీ ఇచ్చారు. సహచర క్రికెటర్లుగా మేమంతా అతడి వెనుకుంటాం అని పేర్కొన్నారు.