Home Page SliderNational

“RCB” ఈ పాప కోసమైనా ఒక్కసారి కప్పు గెలవొచ్చుగా..!

భారతదేశంలో IPL మ్యాచ్ ప్రారంభమయ్యి ఇప్పటికి 15 ఏళ్లు అవుతుంది.అయితే ఈ 15 ఏళ్లల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న RCB జట్టు IPL ట్రోఫీని మాత్రం దక్కించుకోలేక పోయింది. దీంతో ఈ 16 వ సీజన్‌లో అయిన RCB ట్రోఫీని కైవసం చేసుకోవాలని RCB అభిమానులు కోరుకుంటున్నారు. కాగా అభిమానులు వారి కోరికను వినూత్న రీతిలో చాటుకుంటున్నారు. నిన్న జరిగిన RCB Vs KKR మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో RCB ఓటమిపాలయ్యింది. ఈ నేపథ్యంలో నిన్న ఓ చిన్నారి స్టేడియంలో పట్టుకున్న ప్లకార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ ప్లకార్డులో ఏముందంటే “RCB IPL కప్పు గెలిచేంతవరకు తాను స్కూల్‌లో జాయిన్ అవ్వనని రాసుంది”. కాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. వారిలో ఒకరు కనీసం ఆ పాప కోసమైనా ఒకసారి టైటిల్‌ను గెలవండి అని కామెంట్ చేశారు. అయితే మరొకరు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఫ్యాన్‌తోపాటు పంజాబ్ కింగ్స్ అభిమాని ఛాయ్ బండి పెట్టుకోవాలని కామెంట్ చేశారు.