పంజాబ్ నేషనల్ బ్యాంకుకు RBI భారీ జరిమానా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంకుకు భారీ జరిమానా విధించింది. కాగా పంజాబ్ నేషనల్ బ్యాంకు పలు రికార్డులను భద్రపరచడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. దీంతో RBI ఏకంగా రూ.1.31 కోట్ల జరిమానా కట్టాలని పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఆదేశించింది. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణాలు,అడ్వాన్సులకు సంబంధించి నిబంధనలు ఉల్లఘించడంతో పాటు కస్టమర్ల చిరునామాలకు సంబంధించిన రికార్డులను భద్రపరచడంలో విఫలమైందని RBI ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా బ్యాంకు పనితీరుపై 2022 మార్చి 30న RBI తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో నిబంధనలు,ఆదేశాలు పాటించని బ్యాంకులకు RBI నోటీసులు జారీ చేసింది. అయితే ఆయా బ్యాంకులు నోటీసులకు సరైన వివరణను సమర్పించలేకపోయినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన RBI భారీ మొత్తంలో ఫైన్ వేసింది.

