వడ్డీరేట్లపై ఆర్‌బీఐ కీలక అప్‌డేట్
వడ్డీరేట్లపై ఆర్‌బీఐ స్టేటస్ కో ప్రకటించింది. ఈ అక్టోబర్ మీటింగులో కూడా రెపోరేట్లపై మార్పులు లేవని, 6.5 శాతం వద్ద యధాతథంగా ఉంటుందని పేర్కొంది. 2023 ఫిబ్రవరి నుండి ఇదే రేటును కొనసాగిస్తోంది ఆర్‌బీఐ. గత పదిసార్లుగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ మీటింగు నిర్ణయాలను కూడా ప్రకటించారు గవర్నర్ శక్తికాంత దాస్. తాము న్యూట్రల్ వైఖరినే అనుసరిస్తున్నామని, ఇన్‌ఫ్లేషన్ తగ్గుదల ఇంకా నెమ్మదిగా, అసాధారణంగానే ఉందన్నారు.