రవీంద్ర జడేజా భార్య నామినేషన్ దాఖలు
క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివబా జడేజా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆమె జామ్నగర్ నార్త్ నుంచి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. భార్య వెన్నంటే ఉన్న రవీంద్ర జడేజా ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. తన భార్య ఎమ్మెల్యేగా విజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సేవ చేసేందుకే రివబా రాజకీయాలను ఎంచుకున్నారని ట్విటర్లో తెలిపారు. రవీంద్ర జడేజా సోదరి నైనా జడేజా ఇదే నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న నైనా జడేజాకు కాంగ్రెస్ టికెట్ ఖరారైతే జామ్నగర్ నార్త్ నియోజక వర్గంలో పోరు ఆసక్తికరంగా మారుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

