రికార్డు బద్దలు కొట్టిన రవీంద్ర జడేజా
న్యూజిలాండ్‌లో మూడవ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న టీమిండియా ఈ సారి దివాలా స్థాయికి వెళ్లకుడదని పట్టుదలగా ఆట మొదలుపెట్టింది. ఈ క్రమంలో భారత్ ఆటగాడు రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సాధించాడు. దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్ రికార్డును బద్దలు కొట్టి టెస్టు మ్యాచ్‌లలో 312 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. దీనితో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లలో ఐదవస్థానంలో నిలిచాడు. వాంఖడే మైదానంలో జరుగుతున్న ఈ మూడవ టెస్టులో భారత్ రికార్డులు సృష్టిస్తోంది. తొలి రెండు టెస్టులలో టీమిండియాను ఓడించి, ఇప్పటికే న్యూజిలాండ్ 2-0 స్కోరుతో విజయాన్ని సాధించింది. ఈ మూడవ మ్యాచ్ నామమాత్రంగా జరుగుతున్నా భారత్ పట్టుదలగా ఆడుతోంది.