చాహర్ ఫిట్‌నెస్‌పై రవిశాస్త్రి అసహనం
చెన్నై బౌలర్ దీపక్ చాహర్ ఫిట్‌నెస్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చెన్నై టీమ్‌లో ఉన్న చాహర్ గత 18 నెలలుగా గాయాలబారిన పడపతూనే ఉన్నారని ఆయన తెలిపారు. కాగా CSK యాజమాన్యం త్వరగా చాహర్‌కు ప్రత్యమ్నాయాన్ని కనుగొనాలని ఆయన సూచించారు. అయితే గతవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపక్ చాహర్ గాయపడిన విషయం తెలిసిందే. దీంతో చాహర్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో చాహర్‌కు బదులుగా ఇంక ఎవరినైనా జట్టులోకి తీసుకుంటే మంచిదని రవిశాస్త్రి CSK యాజమాన్యానికి తెలిపారు. దీంతో CSK యాజమాన్యం ఎవరిని తీసుకోవాలా అని ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈసారి పలువురు క్రికెటర్లు ఫిట్‌నెస్ లేకపోవడం వల్లే సరిగ్గా ఆడలేకపోతున్నారని క్రికెట్ అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫిట్‌నెస్ లోపించే వన్డేల్లో అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్ IPL లో పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్నారని అని కూడా రవిశాస్త్రి వెల్లడించారు. అతడు ఫిట్‌నెస్‌పై దృష్టి పెడితే ఆటలో మళ్లీ పుంజుకుంటాడని రవిశాస్త్రి పేర్కొన్నారు.