తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ..
తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేగింది. కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ సమీపంలోని కల్యాణ మండపంలో ఇవాళ తెల్లవారుజామున నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై పోలీసుల దాడి చేశారు. ఈ పార్టీలో పాల్గొన్నఐదుగురు మహిళలు, 14 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నూతన సంవత్సరం సందర్భంగా రేవ్ పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. వీరంతా ఫెర్టిలైజర్ వ్యాపారస్థులుగా చెందినవారిగా గుర్తించినట్లు చెబుతున్నారు. యువతులు గుంటూరుకు చెందినవారు. అయితే.. యువకులు రాజమండ్రికి చెందిన వారుగా తెలుస్తోంది. ఫంక్షన్ హాల్ యజమాని పరారీలో ఉండడంతో ఆయన కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.