News

పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీగా రతన్ టాటా

పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళాలు అందించిన ప్రజలను ప్రశంసించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అత్యవసర ఆపద పరిస్థితులను సమర్థవంతంగా ప్రతిస్పందించడంలో పీఎం కేర్స్ ఫండ్ నిధులు ఎంతగానో ఉపకరిస్తున్నాయంది ప్రధాని కార్యాలయం. పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీల సమావేశానికి మోదీ అధ్యక్షత వహించారు. పీఎం కేర్స్ ఫండ్ సహాయంతో 4,345 మంది పిల్లలకు మద్దతు ఇస్తున్న చిల్డ్రన్ పథకాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. కీలకమైన సమయంలో ఫండ్ పోషించిన పాత్రను ట్రస్టీలు అభినందించారు. పీఎం కేర్స్ ఫండ్‌కు మనస్పూర్తిగా సహకరించినందుకు దేశ ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. PM కేర్స్ ఫండ్‌లో ట్రస్టీలను ప్రధాన మంత్రి అభినందించారు.

ఈ సమావేశానికి పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. PM CARES ఫండ్‌కు ట్రస్టీలుగా జస్టిస్ K T థామస్, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి; మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండా, రతన్ టాటా, ఎమెరిటస్ చైర్మన్, టాటా సన్స్ హాజరయ్యారు. ట్రస్టీలతోపాటుగా… PM కేర్స్ ఫండ్‌కు అడ్వైజరీ బోర్డును నియమించారు. మాజీ కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రాజీవ్ మెహ్రిషి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్‌పర్సన్, సుధా మూర్తి, టీచ్ ఫర్ ఇండియా సహ వ్యవస్థాపకుడు, ఇండికార్ప్స్, పిరమల్ ఫౌండేషన్ మాజీ CEO ఆనంద్ షా బోర్డులో సభ్యులుగా ఉంటారు. కొత్త ట్రస్టీలు, సలహాదారుల భాగస్వామ్యం ద్వారా PM కేర్స్ ఫండ్ పనితీరుకు విస్తృత దృక్పథాలను అందజేస్తోందని ప్రధాని మోడీ అన్నారు. ట్రస్టీలతో.. ప్రజా జీవితంలో వారి అపార అనుభవం వివిధ ప్రజా అవసరాలకు మరింత ప్రతిస్పందించేలా చేయడంలో మరింత శక్తిని ఇస్తుందని మోదీ అన్నారు.