‘స్త్రీ’ మేకర్స్‌తో రష్మిక కొత్త చిత్రం
నేషనల్ క్రష్ రష్మిక బాలీవుడ్‌లో దూసుకుపోతోంది. తాజాగా ‘స్త్రీ’ చిత్ర మేకర్స్‌తో కొత్త చిత్రాన్ని అంగీకరించినట్లు అనౌన్స్ చేశారు. ‘యూనిమల్’ చిత్ర విజయంతో బాలీవుడ్‌లో రష్మిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ‘స్త్రీ’, ‘బేడియా’, ‘ముంజ్య’ చిత్రాలు తీసిన మేకర్స్ ఈ చిత్రానికి ‘థమా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ముంజ్య దర్శకుడు ఆదిత్య సర్పోత్థార్ దీనికి దర్శకత్వం వహించనున్నారు. ‘బేడియా’, ‘స్త్రీ’ చిత్రాల నిర్మాత దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది దీపావళికి ఈ చిత్రం విడుదల కానుంది.