ఇండియన్ ఐడల్ స్టేజీపై సందడి చేయనున్న రష్మిక
ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కి ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ లభిస్తోంది. అద్భుతమైన ట్యాలెంట్‌ను వెలికితీస్తూ, సంగీత ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఈ షోకు ఫ్యాన్ ఫాలోయింగ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ షోను ప్రముఖ సింగర్ శ్రీరామ చంద్ర హోస్ట్ చేస్తుండగా, సీజన్-3 జడ్జీలుగా థమన్, కార్తీక్, గీతా మాధురి వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ షోలో గెస్టులుగా పలువురు సెలబ్రిటీలు కూడా వస్తుంటారు. తాజాగా ఈ షోకు గెస్టుగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న రాబోతోంది. ఈ మేరకు షో నిర్వాహకులు అఫీషియల్‌గా అనౌన్స్ చేయడంతో పాటు రష్మికకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘పుష్ప’ చిత్రంతో నేషన్ వైడ్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ, ‘యానిమల్’ మూవీతో ఆ క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. మరి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-3 స్టేజీపై రష్మిక ఎలాంటి సందడి చేయబోతుందో తెలియాలంటే ఆగస్టు 2, 3 తేదీల వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు షో నిర్వాహకులు.