Home Page SliderNational

రష్మిక మందన్న హారర్ మూవీలోకి ఎంటర్?

నేష్‌నల్ క్రష్ రష్మిక మందన్న కొత్త జోనర్‌లోకి అడుగుపెట్టబోతోంది. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా సరసన హీరోయిన్‌గా హారర్ మూవీలో నటించేందుకు ఆమె ఒప్పందం చేసుకున్నట్లు ఒక టాక్ హల్‌చల్ చేస్తోంది. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించే ఈ సినిమాకి ‘వాంపైర్స్ ఆఫ్ విజయనగర’ అని టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఈ ఏడాది బాలీవుడ్‌లో హారర్ నేపథ్య చిత్రాల జోరు ఎక్కువే అని చెప్పాలి. ఇప్పటికే సైతాన్, ముంజ్యా హిట్ మూవీల టాక్ అందుకోగా స్త్రీ 2 బాక్సాఫీసును షేక్ చేస్తోంది.