Andhra PradeshHome Page Slider

కాకినాడలో ఔషధాల చేపకు అరుదైన ధర

కాకినాడలో అరుదైన ఔషధగుణాలున్న కచ్చిడి చేప కుంభాభిషేకం రేవులో దొరికింది. ఎన్నడూ లేని విధంగా ఈ చేపకు వేలంలో  ఏకంగా 3 లక్షల 10 వేల రూపాయల ధర పలికింది. మధ్యవర్తికి కూడా 25 వేల రూపాయలు దక్కింది. ఈ చేప సముద్రంలోనే అరుదుగా లభిస్తుందట. మత్స్యకారులకు ఇది దొరికిందంటే పండగే. ఈ చేపలో ఉండే బ్లాడర్‌కి విపరీతమైన డిమాండ్ ఉంటుందట. దీనితో కిడ్నీలు, ఊపిరితిత్తులు, గాల్ బ్లాడర్ వ్యాధులకు మందులు తయారు చేస్తారని వైద్యులు చెప్తున్నారు. అందుకే పాతిక కేజీలు బరువుండే ఈ చేపకు మూడు లక్షల రూపాయల పైగా ధర పలికింది.