బియ్యపు గింజలతో రేవంత్ రెడ్డి అరుదైన చిత్రపటం
ఒక్కొక్కరు వారికి అభిమాన నాయకులపై కానీ నటీనటులపై కానీ ఉన్న అభిమానాన్ని ఒక్కోరకంగా చాటుకుంటారు. అలాగే తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తన అభిమానాన్ని తన కళ ద్వారా చాటుకున్నాడో ఉపాధ్యాయుడు. హనుమకొండ జిల్లాకు చెందిన రాజ్‌కుమార్ అనే ఉపాధ్యాయుడు రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బియ్యపు గింజలతో రూపొందించారు. ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన రాజ్ కుమార్ ఇక్కడి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కాంట్రాక్టు పద్దతిలో డ్రాయింగ్ టీచర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యమంత్రిపై అభిమానంతో ఆయన చిత్రపటాన్ని రూపొందించారని రాజ్‌కుమార్ తెలియజేస్తున్నారు.


