మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం..ముఖ్యమంత్రి కీలక నిర్ణయం
తిరుపతి జిల్లా వడమాల పేటలో మూడేళ్ల చిన్నారి బాలికపై అత్యాచారం జరిగిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. చాక్లెట్లు ఆశ చూపి, అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారం, హత్య జరగడంతో రాష్ట్రం ఉలిక్కిపడింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ ఇలాంటి ఘటనలు జరగడం చాలా విచారకరం అన్నారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి, బాధిత కుటుంబానికి రూ.10 లక్షల తక్షణ సహాయం అందజేయాలని హోంమంత్రి అనితను అదేశించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా సత్వర చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.