Home Page SliderNational

అభిమానిని కలవడానికి కారు దిగిన రానా..

రానా దగ్గుబాటి ప్రస్తుతం చికాగో విజిట్ చేస్తున్నారు. అతను మాజీ UFC ప్లేయర్ ఆంథోనీ పెట్టిస్‌తో కలిసి రెండు బాక్సింగ్ ఈవెంట్‌లలో పాల్గొననున్నారు. చికాగోలో ఒక అభిమానిని, అతని కుటుంబాన్ని కలవడానికి నటుడు తన కారును మధ్యలో ఆపి వారితో కలిసి ఫొటోలు పంచుకున్నారు. రానా దగ్గుబాటి చికాగో వీధుల్లో ఒక అభిమానిని, అతని కుటుంబాన్ని కలిశారు. ఈ నటుడు రెండు బాక్సింగ్ ఈవెంట్‌లను హోస్ట్ చేయడానికి మాజీ UFC ఛాంపియన్ ఆంథోనీ పెట్టిస్‌తో చేతులు కలిపాడు.

రానా దగ్గుబాటి చికాగోలో తన అభిమానిని, అతని కుటుంబాన్ని కలవడానికి తన డ్రైవింగ్‌ని సైతం  ఆపి మధ్యలో ఆ అభిమానిని కలిశారు. అభిమాని కుటుంబం రానా దగ్గుబాటిని తమ కారులో ఫాలో చేస్తూ ఫోటో అడుగుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అతను వారిని గమనించాడు, రోడ్డుపై వారితో కొంతసేపు గడిపాడు. అభిమాని చొక్కాపై, కారుపై ప్రేమకి చిహ్నంగా సంతకం చేశాడు. ఆ వీడియోను షేర్ చేసిన రానా వారిని ‘అందమైన వ్యక్తులు’ ఉన్నతమైన వారుగా సంబోధించాడు. ఈ వీడియో ఫస్ట్ రానా దగ్గుబాటి ఫ్యాన్ పేజీలో ప్రత్యక్షమైంది. ‘వెట్టయన్’ నటుడు వీడియోను షేర్ చేసి, “అత్యంత అందమైన వ్యక్తులకు ధన్యవాదాలు” అని రాశారు.