మేము సౌత్ ఇండియన్స్, మేమింతే, ఇలాగే చేస్తాం, షారుక్‌కి షాక్ ఇచ్చిన రానా
ప్రతి సంవత్సరం IIFAA అవార్డు వేడుకలు జరుగుతుంటాయి. అలాగే ఈసారి కూడా IIFAA 2024 అవార్డు వేడుక జరుగబోతుంది. దీనికోసం సెప్టెంబరు 10న ముంబయిలో ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్‌లో కరణ్ జోహార్, రానా దగ్గుబాటి, షారుక్ ఖాన్ మొదలయిన తదితరులు పాల్గొన్నారు. షారుక్, ఈ తరం పిల్లలు పెద్దవారి కాళ్లు ఎలా మొక్కుతారో చూపిస్తూ పక్కనే ఉన్న కరణ్ జోహార్ కాలిని తన కాలితో టచ్ చేసి ఆ తర్వాత తన కాళ్లని వాళ్ళే మొక్కుతారంటూ ఫన్నీగా చేసి చూపించారు. ఆ తర్వాత స్టేజ్ పైకి వచ్చిన రానా, షారుక్ ఖాన్‌ను హగ్ చేసుకున్నారు. ఆ తర్వాత షారుక్, కరణ్ జోహార్ కాళ్లు మొక్కి, ‘నేను సౌత్ ఇండియన్‌ని, మేము కాళ్లు ఇలాగే మొక్కుతాం’ అని చెప్పారు. ఆ సమయంలో హాలు మొత్తం ఆడియన్స్ హర్షధ్వానాలతో మార్మోగిపోయింది. షారుక్ మొదట షాక్ అయిన తర్వాత వెంటనే నవ్వుతూ రానాని హగ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. ‘సౌత్ ఇండియన్ కల్చర్ బాగుంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.