NationalNewsNews Alert

రానా దగ్గుబాటి వైఫ్‌ను మీరెప్పుడైనా ఇలా చూశారా?

కునాల్ రావల్, అర్పితా మెహతాల వివాహంలో మెరిసిన మెప్పించిన రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్

డిజైనర్లు కునాల్ రావల్, అర్పితా మెహతాల వివాహాంలో ప్రత్యేకత చాటుకున్నారు టాలీవుడ్ సన్సేషనల్ స్టార్ రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్. పండుగ రోజు ధరించే సొగసైన దుస్తులతో జంట దుమ్మురేపింది. వారాంతంలో ముంబైలో జరిగిన వివాహానికి హాజరైన మిహీకా, రానా దగ్గుబాటి తెల్లటి మేలి బంగారంలా మెరుస్తున్న దుస్తుల్లో వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఈ ఫోటోలను మిహీకా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. భర్త రానాతో కొన్ని షాట్‌లను పోస్ట్ చేస్తూ, ఆమె ఇలా రాసింది: “ది చెర్రీ టు మై ఐసింగ్! రానా దగ్గుబాటి # ఓన్లీ లవ్ #AMKR.” మిహీకా సోదరుడు సమర్థ్ బజాజ్… డిజైనర్ కునాల్ రావల్ సోదరి సాషా రావల్ బజాజ్‌ని వివాహం చేసుకున్నాడు.

“ది చెర్రీ టు మై ఐసింగ్” అంటూ రాసుకొచ్చారు.

మిహీకా కూడా వధువు అర్పితా మెహతా, స్నేహితులతో కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేసి… ఓ గర్ల్ గ్యాంగ్… హృదయపూర్వకంగా అభినందనలంటూ రాసుకొచ్చారు.

ప్రత్యేక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, మిహీకా బజాజ్ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. “అందమైన జంటకు అభినందనలు! జీవితంలో నా ఫేవరెట్ కునాల్ రావాల్డ్‌ను… కొత్త ప్రయాణానికి వెళ్తున్న శుభసమయంలో చాలా సంతోషిస్తున్నానన్నారు. అర్పితా మెహతా ఎప్పటికీ అందమైన వధువు అన్నారు. ! #onlylove #amkrfinally #amkrforever.”

రానా దగ్గుబాటి, మిహీక 2020 ఆగస్టులో హైదరాబాద్‌లో కొంతమంది కుటుంబ సభ్యుల సమక్షంలో సన్నిహిత వేడుకలో వివాహం చేసుకున్నారు. మిహీకా బజాజ్ డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో అనే ఇంటీరియర్ డెకర్, ఈవెంట్ వ్యాపారాన్ని నడుపుతున్నారు. SS రాజమౌళి బాహుబలి సిరీస్‌లో భల్లాలదేవగా ప్రసిద్ధి చెందిన రానా దగ్గుబాటి, ది లీడర్, నా ఇష్టం, డిపార్ట్‌మెంట్, కృష్ణం వందే జగద్గురుమ్, ఆరంభం, బేబీ, బెంగుళూరు నాట్‌కల్, హౌస్‌ఫుల్ 4, ఘాజీ అటాక్, తెలుగు, తమిళం, హిందీ చిత్రాలలో పాపులర్ అయ్యాడు.