రాముల వారి భూములని కాపాడే ఆలోచన
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం భూముల రక్షణకు ఆ శాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి సెంటు జాగాకు పక్కాదస్త్రాలను ఆన్‌లైన్‌లో సిద్ధం చేయాలని ఆలోచన. మాన్యం భూముల ఆక్రమణకు గురి కాకుండా ఉండేందుకు వ్యూహరచన చేస్తున్నారు. దేవుడి ఆస్తి ఎక్కడున్నా అది దేవుడిదే అవుతుందని ఇప్పటికే ఉన్నత వర్గాలు స్పష్టం చేశాయి. రాముల వారికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖరీదైన భూములు ఉన్నాయి. ఇటీవల రెండు చోట్ల కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దీంతో దీర్ఘకాలంగా ఉన్న ఆక్రమణల సమస్యకు పరిష్కారం ఏర్పడుతుందని అధికారులు అనుకుంటున్నారు. అధునాతన పరికరాలతో స్థలాల ఫొటోలు తీసి వాటి కొలతలను జియో ట్యాగ్ సహకారంతో కంప్యూటర్‌లో నిక్షిప్తం చేయనున్నారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఇప్పటికే అధికారులకు ఆర్డర్స్ జారీ చేశారు.