యువమంత్రిగా సత్తా చూపిస్తా..రామ్మోహన్ నాయుడు
యువకులు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, కేంద్రప్రభుత్వంలో యువ మంత్రిగా సత్తా చాటుతానని శ్రీకాకుళం ఎంపీ, విమానయాన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రామ్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టును జెట్ స్పీడుతో అభివృద్ధి చేస్తామని, ఉత్తరాంధ్రకు ఇది కీలకంగా మారుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు సలహా, సంప్రదింపులు తీసుకుని రాష్ట్రానికి విమానయాన రంగంలో మంచి పేరు తెచ్చేవిధంగా కృషి చేస్తానని ఆయన చెప్పారు. ఏవియేషన్ రంగాన్ని పరుగులు పెట్టిస్తానని, విజన్ చూపిస్తానని తెలిపారు. చిన్న వయస్సులో కేంద్రమంత్రిగా తనను ఎంపిక చేసిన చంద్రబాబు నాయుడికి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.