కేంద్రమంత్రిగా రామ్మెహన్ నాయుడు బాధ్యతలు
ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి కూటమి అభ్యర్థిగా కింజరపు రామ్మెహన్‌నాయుడు భారీ మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే వరుసగా మూడోసారి ఆయన ఎంపీగా గెలిచారు. దీంతో ఆయనకు మోదీ కేబినెట్‌లో చోటు దక్కింది. ఈ మేరకు ఆయన ఈ నెల9న కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఈ రోజు కేంద్ర మంత్రిగా రామ్మెహన్‌నాయుడు బాధ్యతలు స్వీకరించారు.చిన్నవయస్సులోనే కేబినెట్ మంత్రిగా రామ్మెహన్‌నాయుడు రికార్డ్ సృష్టించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఏపీ సీఎం చంద్రబాబు,లోకేష్,పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. తనని అఖండ మెజారిటీతో మూడోసారి ఎంపీగా గెలిపించిన శ్రీకాకుళం ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.ప్రధాని మోదీ కేబినెట్‌లో అతిముఖ్యమైన శాఖ దక్కడం గర్వంగా ఉందన్నారు.కాగా విమానయాన శాఖ కోసం 2047 వరకు ప్రణాళిక సిద్ధంగా ఉందన్నారు.దీని ప్రకారం టైర్-2,టైర్-3 నగరాల్లోనూ ఎయిర్‌పోర్ట్‌లు,ఏపీలో ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. విదేశాల్లో అమలవుతున్న కొత్త విధానాలపై కూడా స్టడీ చేస్తామన్నారు. కాగా ప్రధాని మోదీ,చంద్రబాబు విజన్‌తో ముందుకెళ్తామని కేంద్రమంత్రి రామ్మెహన్‌నాయుడు స్పష్టం చేశారు.