రాజమౌళి SSMB 29-పై రాంగోపాల్ వర్మ కామెంట్స్
రాజమౌళి గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్టుగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు – ఎస్‌ఎస్ రాజమౌళి కాంపౌండ్ నుంచి రాబోతుంది ఎస్‌ఎస్‌ఎంబీ 29.. తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ఎస్‌ఎస్‌ఎంబీ 29. ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా ఇంటర్నేషనల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రానున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
కాగా ఈ సినిమాపై రాంగోపాల్ వర్మ సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఎస్‌ఎస్‌ఎంబీ 29 అన్ని సినిమాలకు మించి ఉండబోతుందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు వర్మ. దీని గురించి వర్మ మాట్లాడుతూ.. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత ఎస్‌ఎస్ రాజమౌళి ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం సాంకేతిక నిపుణుల బృందానికి అత్యధిక సమయాన్ని కేటాయిస్తున్నాడు. మహేష్‌బాబు, రాజమౌళి సినిమా మన ఊహలకు అందని విధంగా ఉండబోతుందని అనుకుంటున్నాను అని అన్న వర్మ. ఎస్‌ఎస్ రాజమౌళి విజయం తెలుగు సినిమాకు సంబంధించినదని నేను అనుకోవడం లేదు. ఒకవేళ అతడు (జక్కన్న) గుజరాత్ వ్యక్తి అయినా.. తను అలాంటి సినిమాలనే తెరకెక్కించి అవే అత్యున్నత శిఖరాలకు వెళ్లేవాడంటూ ఆకాశానికెత్తేశాడు జక్కన్న. ఈ మూవీలో హాలీవుడ్ స్టార్‌తో పాటు వివిధ భాషలకు చెందిన నటీనటులు కనిపించబోతున్నారని తెలుస్తూండగా.. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా కోసం మహేష్‌బాబు ఇప్పటికే లాంగ్ హెయిర్‌తో స్టైలిష్ లుక్‌లోకి వెళ్లాడని చెప్పనవసరం లేదు.

