Home Page SliderTelangana

రాంచరణ్ ఉపాసన దంపతులకు ఆడపిల్ల- ఆనందంతో మెగాస్టార్ ట్వీట్

మెగాస్టార్ చిరంజీవి ఇంట మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టింది. రాంచరణ్- ఉపాసన దంపతులకు మంగళవారం తెల్లవారు జామున ఆడపిల్ల జన్మించింది. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చిందని, తల్లి బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని, అపోలో ఆసుపత్రి ప్రకటన విడుదల చేసింది. చిరంజీవి, సురేఖ కుటుంబసభ్యులందరూ సోమవారం రాత్రి నుండి ఆసుపత్రిలోనే ఉన్నారు. రాంచరణ్-ఉపాసనలకు 2012లో వివాహమయ్యింది. దాదాపు 10 సంవత్సరాల అనంతరం వీరు బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారు. దీనితో మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి తన మనుమరాలిని ఆహ్వానిస్తూ ట్వీట్ చేశారు. లిటిల్ మెగా ప్రిన్సెస్‌కు స్వాగతం అంటూ, నీ రాకతో మెగా ఫ్యామిలీకి ఆనందం, ఉత్సాహం తీసుకొచ్చావని, తాతగా తనకు, తల్లిదండ్రులుగా రాంచరణ్, ఉపాసనలకు చాలా గర్వంగా ఉందని తెలియజేశారు. ఈమధ్యనే రాంచరణ్ దంపతులు చిరంజీవి ఇంటికి షిఫ్ట్ అయ్యారు. తమ పుట్టబోయే బిడ్డకు కుటుంబసభ్యుల ప్రేమాభిమానాలు కావాలంటూ, వారు కలిసి ఉండడానికి నిర్ణయించకున్నారు. బిడ్డ పెరుగుదలలో గ్రాండ్ పేరంట్స్‌ పాత్ర ఎంతో ఉంటుందని, పిల్లలు వారితో కలిసి ఆనందంగా ఉంటారని పేర్కొన్నారు. దీనితో మెగా ఫ్యామిలీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.