Home Page Sliderhome page slidermoviesNationalNewsNews Alertviral

రామాయ‌ణ సినిమా బ‌డ్జెట్…?

ఈ మ‌ధ్య సినిమా బ‌డ్జెట్ భారీగా పెరిగింది. ముఖ్యంగా బాహుబ‌లి త‌ర్వాత నుండే ఈ మార్పులను నిర్మాత‌లు తీసుకువచ్చారు. దీంతో బ‌డా బ‌డ్జెట్ సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్‌లో రూపొందుతోన్న భారీ సినిమా ‘రామాయణ’ను రూ.1,500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారని ఇటీవ‌ల ప్ర‌చారం జ‌రిగింది. ఈ సినిమా బడ్జెట్‌ గణనీయంగా పెరిగిందట‌. రెండు భాగాలు కలిపి అక్షరాలా రూ.4,000 కోట్లు ఖర్చవుతుందని నిర్మాత నమిత్ మల్హోత్రా స్వయంగా వెల్లడించారు. ఇది దాదాపు 500 మిలియన్ డాలర్లకు సమానం అని ఒక పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నమిత్ మాట్లాడుతూ, ఈ సినిమా నాతో పాటు భారతీయులు అంద‌రూ గ‌ర్వప‌డే సినిమా అవుతుంది. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో విజువల్స్, టెక్నాలజీ, క్వాలిటీ ఉండేలా చూస్తున్నాం. రామాయణను రెండు భాగాలుగా విడుదల చేయ‌నుండ‌గా, పార్ట్ 1 – 2026 దీపావళికి రానుంది. పార్ట్ 2: 2027లో రిలీజ్ చేయ‌నున్నారు. ఇతర బాలీవుడ్ ప్రొడ్యూసర్ల నుండి వస్తున్న విమర్శలకు కంటెంట్‌ ద్వారానే సమాధానం చెబుతానని నమిత్ అంటున్నారు. ‘‘ఇది లైఫ్ టైం థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది’’ అని ధీమాగా చెప్పారు.