రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్.. ట్రైలర్!
రామ్ పోతినేని – పూరి జగన్నాథ్ కాంబోలో వస్తోన్న ఫుల్ యాక్షన్ చిత్రం డబుల్ ఇస్మార్ట్. గతంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన కావ్యా థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. వైజాగ్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో ట్రైలర్ విడుదల చేశారు.
ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ అద్భుతమైన రిస్పాన్స్ వచ్చింది. తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే రామ్ డైలాగ్స్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ బిగ్‌బుల్ పాత్రలో మెప్పించనున్నారు. కాగా.. ఈ నెల 15న ఇండిపెండెన్స్ డే రోజున సినిమా రిలీజ్ కానుంది.

